English | Telugu

భరత్ అనే నేను కి కష్టాలు తప్పవా?

on Apr 26, 2018

 

శ్రీమంతుడు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. కష్టకాలంలో ఉన్నప్పుడు, మహేష్ బాబు కి కొరటాల శివ శ్రీమంతుడు తో పెద్ద బ్రేక్ ఇచ్చాడు. అంతకు ముందు వరుస ఫ్లాపులతో ఎంతో స్ట్రెస్ కి గురయిన మహేష్ బాబు కి శ్రీమంతుడు హిట్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అయితే, శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు రెండు వరుస ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. బ్రహ్మోత్సవం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోగా, ఎన్నో హోప్స్ పెట్టుకున్న స్పైడర్ కూడా నిరాశే మిగిల్చింది. అలంటి సమయంలో మహేష్ బాబు, కొరటాల శివ తో భరత్ అనే నేను సినిమా చేసాడు. ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ మధ్య జరిగింది. తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా అని మహేష్ బాబు తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. అయితే, వర్కింగ్ డేస్ లో కొన్ని ఏరియాల్లో తప్పితే, భరత్ అనే నేను మిగతా ఏరియాల్లో పెద్దగా ప్రాభవం చూపించలేక పోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రంగస్థలం మినహా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కాస్త నెమ్మదించింది. పంపిణీదారులు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లాలంటే భరత్ అనే నేను ఇంకా పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టాల్సి ఉంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి, ఈ సినిమాకి ఇంకొన్ని రోజులు ఢోకా ఉండకపోవచ్చు. వినూత్న రీతిలో చేస్తున్న ప్రమోషన్స్ కూడా రానున్న రోజుల్లో సినిమాకి ప్లస్ చేసే అవకాశం ఉంది. భరత్ అనే నేను మంచి కలెక్షన్స్ రాబడితే ఓకే, లేదంటే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి ఇబ్బందులు తప్పవు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here