మహేష్ మే సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?
on Apr 14, 2016
మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ డేట్ లో కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. దాంతో ఏప్రిల్ లో రిలీజవ్వాల్సిన సినిమా డేట్ మే నెలకు మారిపోయింది. ఇప్పుడు ఈ మే నెల మహేష్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అందుక్కారణం లేకపోలేదు. గతంలో మే హీట్ లో రిలీజైన మహేష్ సినిమాలు నిజం, నాని. రెండూ కూడా ప్రిన్స్ కెరీర్లోనే మర్చిపోలేని పరాజయాలుగా మిగిలిపోయాయి. దాంతో మహేష్ కు మే అచ్చిరాదనే సెంటిమెంట్ పడిపోయింది. ఇప్పుడు బ్రహ్మోత్సవాన్ని ధైర్యంగా మే లోనే రిలీజ్ చేసే ప్లాన్ వేస్తున్నారు దర్శకనిర్మాతలు. కానీ అభిమానులు మాత్రం ఈ నెల గురించి గుండె దడగా ఉన్నా ఈసారి మహేష్ తన మే సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ కానప్పటికీ, షూటింగ్ లేటైతే, సమ్మర్ లో కూల్ సినిమా కాస్తా జూన్ నెలకు మారిపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు. పివిపీ బ్యానర్ పై ఊపిరితో హిట్ కొట్టిన పొట్లూరి వరప్రసాద్ బ్రహ్మోత్సవాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.