దుబాయ్‌లో 'సర్కారు వారి పాట' షూటింగ్ షురూ
on Jan 25, 2021
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం షురూ అయ్యింది. నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి ఇదివరకే దుబాయ్‌కు చేరుకోగా, ఆదివారం కీర్తి సురేశ్ బయలుదేరి వెళ్లింది. మహేశ్, కీర్తి కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇది.
తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మూడు నిర్మాణ సంస్థలూ "The Auction and the Action begins #SarkaruVaariPaataShuru" అంటూ ట్వీట్ చేసి, క్లాప్ బోర్డ్ ఎమోజీని జోడించాయి.
'సరిలేరు నీకెవ్వరు' లాంటి కెరీర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ మూవీ తర్వాత మహేశ్ నటిస్తోన్న, 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో 'సర్కారు వారి పాట'పై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. అందుకు 'సర్కారు వారి పాట' హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ వేదికపై రికార్డుల మోత మోగించడం ఓ నిదర్శనం. ఆ హ్యాష్‌ట్యాగ్ 100 మిలియన్ ట్వీట్స్ సాధించడం పెద్ద విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
