మహేష్ కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్ రికార్డు
on Jun 17, 2021
మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్ లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. 15 ఏళ్ల వయసులోనే గౌతమ్ ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నమ్రత.
2018లో ఫ్రొఫెషనల్ స్విమ్మర్ గా మారిన గౌతమ్.. 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చారు నమ్రత. గౌతమ్ బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని.. అతనికి ఫ్రీ స్టైల్ అంటే బాగా ఇష్టమని తెలిపారు.
కాగా, మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. అప్పుడు నటనతో మెప్పించి మహేష్ అభిమానులను ఖుషీ చేసిన గౌతమ్.. ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించి తల్లిదండ్రులతో పాటు అభిమానులు గర్వపడేలా చేశాడు.
Also Read