సూపర్‌స్టార్‌తో `ఎఫ్ 2` దర్శకుడు!!
on Feb 13, 2019
సూపర్ స్టార్ మహేష్ `భరత్ అనే నేను` సక్సెస్ తర్వాత సినిమాలు చేయడంలో స్పీడు పెంచాడు. ప్రజంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. దీని తర్వాత వెంటనే సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేయాలనుకున్న మహేష్ ...సుకుమార్ కథ కోసం ఇంకాస్త టైమ్ అడగడంతో అప్పటి వరకు ఖాలీ గా ఉండే కన్నా మరో దర్శకుడుతో సినిమా చేయాలని ఫిక్సయ్యాడట. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరక్టర్స్ మహేష్ కు కథ వినిపించారట. ఇందులో అనిలీ రావిపూడి కూడా ఉన్నాడని సమాచారం అందుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న అనిల్. ఇప్పుడు మహేశ్ బాబు కోసం కథ సిద్దం చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దూకుడు , ఆగడు సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసారు అనిల్ , మహేశ్ బాబు. అప్పుడు శీనువైట్లతో ఉన్న అనిల్ రావిపూడి. ఇప్పుడు వరస విజయాలతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి , మహేష్ కు స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకున్నాడని తొందర్లనే స్టోరీ డెవలప్ చేసి మహేష్ కు వినిపించనున్నాడు. మహేస్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తొందర్లనే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాను దూకుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించి అవకాశాలున్నాయి. మొత్తానికి సుకుమార్ సినిమా లేట్ అవ్వడంతో, ఇప్పుడు సీన్ లోకి అనిల్ రావిపూడి ఎంటరయ్యాడు.