మహేశ్ ట్వీట్.. కదిలిపోయిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!
on Apr 17, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారనే వార్త శుక్రవారం సాయంత్రం వెల్లడి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ వార్త ఎంత వైరల్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఫ్యాన్స్ ప్రార్థనలు చేశారు. పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు పెట్టారు.
సూపర్‌స్టార్ మహేశ్ సైతం పవర్‌స్టార్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ను కదిలించి వేసింది. “Wishing you a speedy recovery @PawanKalyan. Get well soon! Strength and prayers,” అని మహేశ్ ట్వీట్ చేశారు.
దీనికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే బాగా కదిలిపోయారు. మహేశ్ మనసు బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల 'వకీల్ సాబ్' మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమా చూసి, పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ను ప్రశంసిస్తూ మహేశ్ చేసిన ట్వీట్ కూడా అందరి మనసుల్నీ దోచుకుంది.