మహేశ్ జీవితంలో ఎంజాయ్ చేస్తున్న ఐదు అంశాలేమిటి?
on Aug 13, 2020
ప్రిన్స్‌గా మహేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి వారసత్వం ఉపకరించింది కానీ, సూపర్‌స్టార్‌గా ఎదగడంలో మాత్రం ఆయన కష్టం, ప్రతిభ దాగున్నాయని ఎవరైనా అంగీకరిస్తారు. తను పోషించిన క్యారెక్టర్లతో టెర్రిఫిక్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకు ఫ్యాన్ బేస్ అసాధారణంగా పెరిగింది. ఇవాళ టాలీవుడ్ స్టార్స్‌లో అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నవారిలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు.
మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హిట్, సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలతో తెలుగువాళ్ల ఆరాధ్య కథానాయకుడిగా మారాడు మహేశ్. సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆడియెన్స్ వెర్రెత్తిపోయే స్థాయికి ఆయన చేరుకున్నాడు. మిగతా స్టార్లకు, ఆయనకు మధ్య కనిపించే ఒక భేదం.. ఆయనలోని మొహమాటం. బయటకు ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్‌గా కనిపించడం ఆయనలోని మరో గుణం. మొదట్లో కెరీర్లో ఆటుపోటులు ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత క్రమక్రమంగా స్క్రిప్ట్స్ ఎంపికపై పట్టు సాధించి ఇప్పుడున్న స్థాయికి చేరుకున్నాడు. అందుకు తగ్గట్లే జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆయన ఎంజాయ్ చేస్తున్న అంశాలేమిటో చూద్దాం...
1. భారీ ఆదాయం
సినిమా ఆఫర్ల విషయంలో కానీ, బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయంలో కానీ టాలీవుడ్లో టాప్ పొజిషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్. 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సక్సెస్ తర్వాత సినిమాకి ఆయన వసూలు చేసే రెమ్యూనరేషన్ రూ. 50 కోట్లకు చేరుకుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఎండార్స్మెంట్ల ద్వారా ఏడాదికి రూ. 35 కోట్ల దాకా ఆయన సంపాదిస్తున్నాడు.
2. ఆస్తులు
ఫిల్మ్‌నగర్‌లో అత్యంత ఎత్తయిన సీలింగ్‌తో ఉన్న విలాసవంతమైన బంగళాలో నివాసముంటున్నాడు మహేశ్. జూబిలీ హిల్స్‌లో రెండు బిల్డింగ్లు కూడా ఆయనకు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 30 కోట్ల దాకా ఉంటుందని అంచనా. అలాగే బెంగళూరు, ముంబైలలోనూ ఆయనకు ఆస్తులు ఉన్నాయి. 2020లో ఆయన ఆస్తుల విలువ రూ. 160 కోట్లని తెలుస్తోంది.
3. కార్లు
మహేశ్‌కు కార్లంటే బాగా ఇష్టం. ఆయన దగ్గర మొత్తం ఆరు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి ఏ8, లంబోర్గిని గ్యాలార్డో, రేంజ్ రేవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ లాంటివి ఉన్నాయి. వాటి విలువ రూ. 9 కోట్ల దాకా ఉంటుంది.
4. కారవాన్
మహేశ్‌కు ఉన్న పర్సనల్ కారవాన్ గురించి ఇండస్ట్రీలో తెగ చెప్పుకుంటూ ఉంటారు. దీనిని ఆయన 2013లో కొన్నాడు. ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలన్నీ ఉండే ఈ వానిటీ వ్యాన్ విలువ రూ. 6 కోట్ల పైమాటే.
5. వ్యాపారాలు
మహేశ్‌లో కేవలం నటుడు మాత్రమే కాదు, వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ద హంబుల్ కో. అనే సొంత క్లాతింగ్ బ్రాండ్‌ను ఆయన స్టార్ట్ చేశాడు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై టాప్ రిటైల్ బ్రాండ్లలో ఒకటిగా అది పేరు తెచ్చుకుంది. గచ్చీబౌలిలో 7 స్క్రీన్లు ఉన్న లావిష్ ఏఎంబీ సినిమాస్‌లో 20 శాతం షేర్లు ఉన్న వ్యాపార భాగస్వామి ఆయన. అలాగే జీఎంబీ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి, తను నటిస్తోన్న సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ, ఆ రకంగానూ ఆర్జిస్తున్నాడు.
లైఫ్‌ను ఇంత విలాసవంతంగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ చారిటీ విషయంలోనూ ముందున్నాడు మహేశ్. తన ఆదాయంలో 30 శాతాన్ని దానాలకు ఆయన వినియోగిస్తున్నట్లు సమాచారం. గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయడం, పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం లాంటివి అందులో ఉన్నాయి.