English | Telugu

'మహర్షి' వసూళ్లు, లెక్కలు నిజమేనా?

on May 16, 2019

 

"నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని ఒక వారంలో ఈ సినిమా దాటేయబోతుంది" అని 'మహర్షి' స‌క్సెస్‌మీట్‌లో మహేష్ బాబు చెప్పారు. అందుకు తగ్గట్టు ఈ రోజు 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ "వారం రోజుల్లోనే మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా 'మహర్షి' నిలిచింది" అని ఒక పోస్టర్ ట్వీట్ చేసింది. ఈ లెక్కన సినిమా వసూళ్లు 205 కోట్లకు పైగా వచ్చి ఉండాలి.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని డివివి ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. లాంగ్ ర‌న్‌లో మరో పాతిక ముప్ఫై కోట్లు కలెక్ట్ చేసి ఉండవచ్చు. లాంగ్ రన్ వదిలేసి 'భరత్ అనే నేను' మూడు వారాల వసూళ్లు లెక్కలోకి తీసుకున్నా 'మహర్షి' 205 కోట్ల గ్రాస్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసినట్టే. నాలుగు రోజుల్లో 'మహర్షి' వందకోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ ఒక ట్వీట్ వేసింది.తరవాత మూడు రోజుల్లో మరో వంద కోట్లు కలెక్ట్ చేసేసిందా? 

సాధారణంగా రిలీజ్ వీకెండ్ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఆదివారం తరవాత సోమ, మంగళ, బుధ వారాల్లో వీకెండ్ వసూళ్ల కంటే తక్కువ ఉంటాయి. 'మహర్షి' గురువారం విడుదలైంది. నిర్మాతలు చెప్పినట్టు ఆదివారానికి వంద కోట్లు కలెక్ట్ చేసినా... తరవాత మూడు మరో రోజుల్లో మరో వంద కోట్లు ఎలా కలెక్ట్ చేసిందో? ఈ పాయింట్ లేవదీస్తున్నారు కొందరు ప్రేక్షకులు. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ అనడం తప్ప ఎంత కలెక్ట్ చేసిందో ఎందుకు చెప్పడం లేదు? మహేష్ వసూళ్లు, లెక్కలు నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు. మహేష్ మెహర్బానీ కోసం లెక్కలు ఎక్కువ చేసి చూపిస్తున్నారని సెటైర్స్ వేస్తున్నారు. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్' కలెక్షన్స్ విషయంలో 'దిల్' రాజు విమర్శలు ఎదుర్కొన్నారు. 'భరత్ అనే నేను' కలెక్షన్స్ విషయంలోనూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు 'మహర్షి' వంతు వచ్చింది. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపిస్తున్నారనే అపవాదును మూట కట్టుకుంటున్నారు. 

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here