నితిన్‌తో హ్యాట్రిక్ కొడతాడా!
on Sep 18, 2021
మెలోడీబ్రహ్మ మణిశర్మ తనయుడిగా స్వరంగేట్రం చేసినా.. తనవైన బాణీలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న మహతి.. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. యూత్ స్టార్ నితిన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు మహతి రెండు సినిమాలు చేయగా.. ఆ రెండు కూడా మంచి విజయం సాధించాయి. గత ఏడాది ఆరంభంలో విడుదలైన `భీష్మ` బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమ్ అయిన `మాస్ట్రో`తో మరో సక్సెస్ సొంతమైంది. ఈ నేపథ్యంలో.. వీరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం `మాచర్ల నియోజకవర్గం`పై ఆసక్తి నెలకొంది. మరి.. `మాచర్ల నియోజకవర్గం`తో నితిన్, మహతి జోడీ హ్యాట్రిక్ కాంబోగా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, `మాచర్ల నియోజకవర్గం`కి ఎస్.ఆర్. శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి మెయిన్ లీడ్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నట్లు బజ్.