షూటింగ్లో విషాదం..ఇద్దరు నటుల దుర్మరణం
on Nov 7, 2016
సినిమా షూటింగ్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తోన్న మస్తీగుడి సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇవాళ బెంగుళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్ సమీపంలో జరుగుతోంది. స్క్రిప్ట్ ప్రకారం హెలికాఫ్టర్ నుంచి హీరోతో పాటు ఇద్దరు విలన్లు దూకాలి.. డైరెక్టర్ యాక్షన్ అనగానే హెలికాఫ్టర్ నుంచి దూకారు అంతా అనుకున్నట్లే జరిగింది. కానీ హెలికాఫ్టర్ నుంచి దూకిన ఇద్దరు నటులు ఈదుతూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద హీరో దునియా విజయ్ ప్రాణాలతో బయటపడ్డాడు. మరణించిన ఇద్దరు నటుల పేర్లు ఉదయ్, అనిల్. మరోవైపు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇంత రిస్కీ షాట్ చిత్రీకరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.