ఓటీటీలో 'మా వింత గాథ వినుమా'
on May 26, 2020
హిందీలో ఐదారు పెద్ద సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి ఓటు వేశాయి. ఆల్రెడీ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన 'ఘూమ్కేతు' జీ5లో విడుదలైంది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబో', విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'శకుంతలాదేవి' తదితర సినిమాలు ఓటీటీ రిలీజులకు వెయిటింగ్. తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు, క్రేజీ తారలు నటించిన సినిమాలు ఓటీటీకి రావడం లేదు. ప్రస్తుతానికి స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీకు క్యూ కడుతున్నాయి.
ఆల్రెడీ 'అమృత రామమ్' అని ఓ చిన్న సినిమా ఓటీటీలో విడుదలైంది. రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' కూడా ఓటీటీలో విడుదల కానుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... 'కృష్ణ అండ్ హిజ్ లీల'లో హీరోగా నటించిన సిద్ధూ జొన్నలగడ్డ, ఆ సినిమా హీరోయిన్లలో ఒకరైన సీరత్ కపూర్ జంటగా నటించిన 'మా వింత గాథ వినుమా' సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందట. త్వరలో ఏ ఓటీటీ ఫ్లాట్ఫార్మ్లో విడుదల కానుంది? ఎప్పుడు విడుదల కానుంది? తదితర విషయాలు వెల్లడించనున్నారని టాక్.
Also Read