చిరంజీవి ప్లేస్ లోకి వచ్చిన ఎన్టీఆర్..!
on Jun 28, 2016
ఇటీవల జరిగిన సినీ మా అవార్డ్స్ వేడుకలో చిరంజీవి డ్యాన్స్ తర్వాత మరో హైలైట్ గా నిలిచిన అంశం ఎన్టీయార్ స్పీచ్. తనకు చిరంజీవి గారు.. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నందమూరి తారకరామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. కృష్ణ గారులు స్పూర్తి అని ఎన్టీయార్ పేర్కొనడం, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం వంటి అంశాలు ఎన్టీయార్ అభిమానులకు మాత్రమే కాదు సినిమా లవర్స్ కు కూడా విపరీతంగా నచ్చేసింది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడే ఓ అభిమాని ఆ తతంగాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు. అప్పట్లో ఆ వీడీయోను కొన్ని లక్షల మంది షేర్ చేశారు. అయితే.. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ లో సదరు అవార్డ్స్ ప్రోగ్రామ్ ను టెలికాస్ట్ చేసినప్పుడు ఎన్టీయార్ స్పీచ్ ను మరోమారు విన్నవారందరూ "షాక్" అయ్యారు. అసలు ఎన్టీయార్ స్టేజ్ మీద మాట్లాడినదానికి, టెలికాస్ట్ అయిన స్పీచ్ కి అస్సలు సంబంధమే లేదు. స్టేజ్ మీద ఎన్టీయార్ తనకు "చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి తారకరామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. కృష్ణ గారు.."లు తన ఇస్పిరేషన్ అని చెప్పగా.. టెలికాస్ట్ లో "నందమూరి తారకరామారావు గారు.. అక్కినేని నాగేశ్వరరావు గారు.. కృష్ణ గారు.."అనే పదాలను ముందుకు మార్చి టెలికాస్ట్ చేశారు. పనిగట్టుకొని మరీ ఈ విధమైన మార్పులు ఎందుకు చేశారో తెలియదుకానీ.. ఎన్టీయార్ అభిమానులు మాత్రం ఈ "ఎడిటింగ్" విషయంలో చాలా ఫీలయిపోతున్నారు!