పాపం లావణ్య.. కంగారుపడిందట...
on Feb 6, 2018
మెగాస్టార్ చిరంజీవి పాటలు ఇప్పటివరకూ ఎక్కువగా ఎవరు రిమిక్స్ చేయారబ్బా అంటే వెంటనే సాయిధరమ్ తేజ్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు మూడు పాటలు రిమిక్స్ చేసి మెగా అభిమానులను ఊర్రూతలూగించిన సాయిధరమ్ తేజ్ తాజాగా తాను నటించిన "ఇంటిలిజెంట్" సినిమాలో కూడా ఓ పాటను రిమిక్స్ చేశాడు. ఆ పాట మరేదో కాదు.. చిరంజీవిగారి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమక్ ఛమక్ ఛామ్'. చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ఖాతాలో ఈ పాట కూడా ఒకటి. ఇక ఈ పాటను కూడా సాయిధరమ్ తేజ్ తన సినిమాలో వాడుకున్నాడు. అయితే ఈసినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. మరి తేజ్ అంటే డ్యాన్స్ ఇరగదీస్తాడు కాబట్టి ఓకే.. మరి లావణ్య డ్యాన్స్ లో కొంచెం వీక్ అనే చెప్పొచ్చు. మరి చిరంజీవి పాట.. అందులో రిమిక్స్.. పక్కన తేజ్ ఇంక ఆమె పరస్థితి ఎలా ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన లావణ్య ఈ సిచ్యుయేషన్ గురించి చెబుతూ...ఈ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు అనగానే చాలా కంగారుపడిపోయాను...చిరంజీవి .. విజయశాంతి స్థాయిలో చేయడం సాధ్యం కాదనిపించింది... తేజు జోడీగా నా స్థాయిలో నేను ఈ రీమిక్స్ కి న్యాయం చేయడానికి ప్రయత్నించాను" అని చెప్పుకొచ్చింది.
ఇంకా ఈసినిమాలో తన పాత్ర గురించి చెబుతూ... ఈ సినిమాలో నా పాత్ర పేరు 'సంధ్య' .. యూఎస్ లో చదువుకుని వచ్చి .. బిజినెస్ లో తండ్రికి సహాయపడుతూ వుంటాను. కొంచెం కోపంగా కనిపించే ఈ పాత్రను వినాయక్ గారు నాతో అద్భుతంగా చేయించారు"..."ఈ మధ్య కాలంలో నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది అని చెప్పుకొచ్చింది ఈ భామ. మరి ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నఈ సినిమాలో ఈ పాట ఏమేరకు అలరించింది.. లావణ్య ఏ రేంజ్ లో డ్యాన్స్ చేసింది తెలియాలంటే ఆరోజు వరకూ ఆగాల్సిందే..