అరగంటసేపు నిర్వాణ మెడిటేషన్.. వీడియో షేర్ చేసిన లక్ష్మీ మంచు!
on Sep 13, 2020
టాలీవుడ్‌లోని టాలెంటెడ్ తెలుగు తారల్లో లక్ష్మీ మంచు ఒకరు. తొలి చిత్రం 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతోటే ఉత్తమ విలన్‌గా నంది అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఆమెది. మరోవైపు టీవీ టాక్ షోలతోనూ తనదైన ముద్ర వేశారు లక్ష్మి. పొఫెషనల్గానే కాకుండా, పర్సనల్ లైఫ్‌లోనూ ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు సమయం లభించినా కుమార్తె నిర్వాణతో సమయం గడపడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నిర్వాణకు సంబంధించిన అందమైన పిక్చర్లు, వీడియోలను ఆమె షేర్ చేస్తుండటం చూస్తున్నాం. అవి భిన్నమైన మూమెంట్స్‌ను హైలైట్ చేస్తుంటాయి. ఈసారి నిర్వాణ చేసిన మెడిటేషన్ వీడియోను ఆమె షేర్ చేశారు.
సెప్టెంబర్ 13 ఆదివారం, పవిత్ర ఏకాదశి సందర్భంగా ఉదయం 10:45 గంటలకు తనను తాను చైతన్యవంతం చేసుకోడానికి, తన షూటింగ్ టీమ్‌లో ఉత్తేజం నింపడానికి మెడిటేషన్ చేయాలని నిర్ణయించారు లక్ష్మి. అరగంట సేపు చేసిన ఆ ధ్యానంతో తమ ఆత్మలు శుద్ధి అయిన ఫీలింగ్ కలిగిందని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మూడు వీడియో క్లిప్‌లను ఆమె షేర్ చేశారు. ఒక క్లిప్‌లో లక్ష్మి పూజా మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా, బయట ఆమె టీమ్ మెడిటేషన్లో కూర్చొంది. ఆ టీమ్‌లో నిర్వాణ కూడా ఉండటం విశేషం. అరగంట సేపు నిర్వాణ కూడా మెడిటేషన్ చేసింది. అమ్మ చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తూ, బుద్ధిమంతురాలైన పిల్లగా నిర్వాణ ఇప్పటికే మంచి పేరు తెచ్చేసుకుంది.
దీనికి ఒకరోజు ముందు అంటే, శనివారం నిర్వాణ మూడు భిన్నమైన జోన్లలో ఉందని చెప్తూ, ఒక జోన్లో గ్లామరస్‌గా, ఇంకో జోన్లో సూపర్ నాటీగా, మరో జోన్లో పూర్తి స్వాగ్ క్వీన్‌గా ఉందంటూ మూడు పిక్చర్లు, వీడియోలను షేర్ చేశారు లక్ష్మీ మంచు.
Also Read