తొలిప్రేమ పై కేటీఆర్ ట్వీట్...
on Feb 11, 2018
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా ఏదంటే... తొలిప్రేమ అని టక్కున చెప్పేయోచ్చు. ఇప్పటికీ పవన్ బెస్ట్ మూవీస్ లో తొలిప్రేమ ఎప్పడూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. మరి అలాంటి సినిమాని టైటిల్ గా పెట్టుకొని.. సినిమా తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కానీ వెంకీ అట్లూరి ఆ ధైర్యం చేశారు. వేరే ఎవరో ఎందుకులే అని వరుణ్ తేజ్ నే హీరోగా పెట్టి తీశాడు. సినిమా తీయడం వరకూ ఓకే.. మరి పవన్ తొలిప్రేమ సినిమాను మరిపిస్తుందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ ఫీట్ కూడా క్రాస్ చేశారు. నిన్న విడుదలైన “తొలిప్రేమ” మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాబాయ్ పేరు అబ్బాయి నిలబెట్టాడని వరణ్ తేజ్ ను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. ఇక ఈ సినిమాపై తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా స్పందించారు. కేవలం రాజకీయాలే కాదు.. అప్పుడప్పుడు సినిమాలు ఫై కూడా కేటీఆర్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చెబుతుంటారు. తొలిప్రేమ సినిమాపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. `తొలిప్రేమ` సినిమాను వెంకీ అట్లూరి అద్భుతంగా తెరకెక్కించారు. గీత రచన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వరుణ్‌తేజ్, రాశీఖన్నా చాలా చక్కగా నటించార`ని కేటీఆర్ ట్వీట్ చేశారు.