కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కృష్ణులు... ముద్దొచ్చే రాధలు!
on Aug 12, 2020
శ్రీ కృష్ణ జన్మాష్టమి ముగిసింది. అయితే... పండుగ శోభ ఇంకా ముగియలేదు. సోషల్ మీడియాలో ప్రేక్షకులకు సెలబ్రిటీల ద్వారా పంచుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారి బాలురను బాల కృష్ణుడిలా ముస్తాబు చేయడం, అమ్మాయిలను రాధలా అలంకరించడం చాలా కుటుంబాల్లో జరిగేదే. సెలబ్రిటీలలో కొందరు సైతం తమ పిల్లలను అలా ముస్తాబు చేసే సంతోష పడ్డారు. వాళ్లను మీరు చూడండి.
మంచి రాధమ్మ!
"శ్రీ కృష్ణుడి పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి నా చిన్నారి నివి అందమైన రాధలా ముస్తాబయింది" అని లక్ష్మీ మంచు ఈ ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా కుమార్తె విద్యా నిర్వాణను రాధలా ముస్తాబు చేశారామె.
కాజల్ కుమారుడు... లడ్డూ గోపాలుడు!
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషాకి ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. పిల్లాడి పేరు ఇషాన్. కృష్ణాష్టమి సందర్భంగా అతడికి బాల కృష్ణుడి గెటప్ వేశారు. "నా చిన్నారి లడ్డు గోపాల్. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ" అని నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దిల్ రాజు మనవడు... మనవరాలు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వాళ్ళిద్దరినీ కృష్ణాష్టమి సందర్భంగా బాలకృష్ణుడు, రాధమ్మగా ముస్తాబు చేశారు. ఆ ఫోటోలను మీరు చూడండి.