ENGLISH | TELUGU  

పవర్‌స్టార్ కొడకా కోటేశ్వరరావు విన్నారా..!!

on Dec 31, 2017

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అత్తారింటికి దారేది, కాటమరాయుడులో తన గాత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న పవర్‌స్టార్ ఈ సినిమా కోసం "కొడకా" అంటూ మరోసారి గొంతు సవరించారు. అనిరుథ్ మ్యూజిక్ ఇచ్చిన అజ్ఞాతవాసి ఆడియోలోని పాటలన్ని మార్కెట్లోకి వచ్చినా.. పవన్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" సాంగ్‌ని‌ మాత్రం విడుదల చేయకుండా ఆపారు. ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం టీజర్‌‌ రిలీజ్ చేసింది.

అందుకు తగ్గట్టుగానే సాంగ్‌తో పాటు మేకింగ్ వీడియోని విడుదల చేసింది హారికా హాసిని క్రియేషన్స్. పాటని పవన్ ఏ స్థాయిలో పాడాడా అనే దానికంటే.. పాట పాడేటప్పుడు పవన్ హావభావాలు, మధ్యలో వచ్చే మేకింగ్ వీడియో.. ఆ పాటలో పదాలు ఆకట్టుకున్నాయి. కొడకా.. కోటేశ్వరరావు ఖరుచైపోతావురోయ్.. పులసైపోతవురాయ్.. అంటూ పవన్ ఆడేసుకున్నాడు. ఈ సాంగ్ అలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.