కిమ్ శర్మ సెక్సీ బీచ్ పిక్చర్.. మాజీ బాయ్‌ఫ్రెండ్ యువరాజ్ సింగ్ కామెంట్!
on Oct 24, 2020
కృష్ణవంశీ 'ఖడ్గం' హీరోయిన్ కిమ్ శర్మ, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొన్నేళ్ల క్రితం చెట్టాపెట్టాలేసుకుని తిరిగిన విషయం చాలా మందికి తెలిసిందే. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. యువరాజ్ బ్రిటీష్ నటి హాజెల్ కీచ్‌ను 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు విషయం ఏమంటే మాజీ ప్రేయసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్‌కు యువరాజ్ కామెంట్ చేయడం!
అవును. కిమ్ శర్మ బీచ్ గురించి కలలు కంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్గా పెట్టిన పోస్ట్ ఇందుకు నిదర్శనం. శనివారం ఆమె తన హాలీడే డైరీస్‌కు సంబంధించిన ఓ పేజీ తెరిచి, తన స్టన్నింగ్ ఫొటోనొకదాన్ని షేర్ చేసింది. దీనికి యువరాజ్ చేసిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫొటోను షేర్ చేసిన కిమ్ "బీచ్‌లో గడిపే రోజు కంటే కంటే మంచి రోజు ఏముంటుంది?" అని క్యాప్షన్ పెట్టింది. దానికి #notmuch #flashback అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది. ప్రస్తుతం ఆమె హృదయం ఎలాంటి ఆలోచనలు చేస్తోందో ఈ పోస్ట్ తెలియజేసింది. ఆ పిక్చర్లో కిమ్ రంగురంగుల బికినీ ధరించి, చేతిలో సర్ఫ్‌బోర్డ్ పట్టుకొని బీచ్‌లో నిల్చొని ఉంది.
ఆ పోస్ట్‌కు రియాక్టయిన యువరాజ్, "Gaon basaa nahi basta lekar pahunch gai hain madam." అని హిలేరియస్ కామెంట్ పెట్టాడు. కిమ్ శర్మ తరచూ తన అందాలన ప్రదర్శించే బికినీ పిక్చర్లతో అభిమానులకు వినోదాన్ని పంచుతూ వస్తోంది. 'ఖడ్గం'లో శ్రీకాంత్ జోడీగా కనిపించిన కిమ్ 'మగధీర' చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది.
Also Read