కరోనా కాలంలో హైదరాబాద్‌లో కన్నడ స్టార్ షూటింగ్
on Jul 16, 2020
ఫైనల్లీ... హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే... అది తెలుగు సినిమా షూటింగ్ కాదు. కన్నడ సినిమాది. లాక్డౌన్ తరవాత తెలంగాణలో షూటింగ్స్‌కి అనుమతులు ఇచ్చాక, స్టార్స్ యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ స్టార్ట్ కాలేదు. బహుశా... ఇప్పుడు కన్నడ సినిమాను చూసి తెలుగు స్టార్స్ కూడా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. అసలు వివరాల్లోకి వెళితే...
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న 'ఫాంటమ్' షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ సిటీలో మొదలైంది. "ప్రొడక్షన్ హౌస్ ప్రతి నిమిషం జాగ్రత్తలు తీసుకుంటోంది. సెట్ లో ఉత్సాహవంతమైన మనుషులను చూడటం గొప్పగా ఉంది. సేఫ్ గా ఉండటం కోసం సెట్ లో ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా, స్మూత్ గా జరుగుతుందని ఆశిస్తున్నాను" అని కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.
కరోనా కాలంలోలో తెలంగాణకు కన్నడ సినిమా యూనిట్ షూటింగ్ చేయడానికి రావడం మంచి విషయం. ఆల్రెడీ రవిబాబు 'క్రష్' షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' షూటింగ్ చేశారు. టీవీ, వెబ్ సిరీస్ షూటింగులు జరుగుతున్నాయి.