బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన ‘ఖైదీ నంబర్ 150’...
on Jan 12, 2017
దాదాపు తొమ్మిది సంవత్సరాల బ్రేక్ తీసుకొని... ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ద్వారా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులు సొంతం చేసుకోగా ఇప్పుడు మరో రికార్డ్ ను బద్దలుకొట్టింది. అది కూడా బాహుబలి రికార్డ్ ను. తొలి రోజు కలెక్షన్లతో ‘ఖైదీ నంబర్ 150’ 'బాహుబలి' రికార్డ్ ను బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపి ఒక్క రోజులోనే 39 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాగా బాహుబలికి ది బిగినింగ్కి మొదటి రోజు కలెక్షన్లు 35 కోట్లు సాధించింది. దీంతో ఇప్పుడు చిరు మరో కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ రికార్డును అదే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి-2 బ్రేక్ చేస్తుందో.. లేదో చూద్దాం.