పవన్ కళ్యాణ్ ను తెలివిగా తప్పించిన నాగబాబు
on Jan 9, 2017
మెగా ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్లు కలకలం రేపాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రచయిత యండమూరిలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు నాగబాబు. వర్మ, చిరు, పవన్ లను ఉద్దేశించి ట్విట్టర్ లో తన పైత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మొన్నా మధ్య యండమూరి ఓ క్లాస్ లో మాట్లాడుతూ.. రామ్ చరణ్‌కీ, దేవిశ్రీ ప్రసాద్‌ని పోల్చే క్రమంలో చరణ్‌ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఈ ఇద్డరికీ మెగా ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చేశారు నాగబాబు. అయితే ఈ ఈవెంట్ లో ఇలాంటి వివాదం అవసరమా ? అనే ప్రశ్న ఉత్పన్నమైయింది జనాల్లో.
దీనిపై రెండు అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒకటి.. మెగా కుటుంబంపై ఇటివల వచ్చిన విమర్శలకు ఎవరో ఒకరు బదులు చెప్పాలి. దీనికి నాగబాబే కరెక్ట్ అని భావించి ఆయనతో విమర్శకుల నోళ్ళుమూయించారని చెబుతున్నారు. నాగబాబు నుండి వచ్చిన కామెంట్స్ మెగా హీరోల కామెంట్స్ గానే భావించాలని, మెగా హీరోల అభిప్రాయం, ఫీలింగ్స్ ను నాగబాబు ద్వారా కక్కించారని,నాగబాబును ఒక ఆయుధంగా వాడారని అనుకుంటున్నారు.
రెండు.. ఈ వేడుకకు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాలేదు. అన్నయ్య ఫంక్షన్‌కి తమ్ముడు పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదన్నది ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈవెంట్ అయిపోయిన వెంటనే దాని గురించి మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదన్నదే హైలెట్ అవుతుంది. అయితే ఇక్కడ పవన్ మేటర్ హైలెట్ కాకూడందంటే అంతకుమించి ఎదో వేడి పుట్టించాలి. నాగబాబు ఆ వేడి పుట్టించడంలో సక్సెస్ అయ్యారు. నాగబాబు కామెంట్స్ దెబ్బకి పవన్ కళ్యాణ్ రాలేదన్న మేటర్ మరుగున పడిపోయింది. మొత్తంమ్మీద ఈ విషయంలో మెగా ఫ్యామిలీ అంతా సక్సెస్ అయ్యిందనే అనుకోవాలి.