English | Telugu

ఆర్జీవి-మెగా బ్రదర్స్.. ఇదీ అసలు గొడవ

on Jan 9, 2017

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మెగా కుటుంబానికి పెద్ద గొడవే జరుగుతోంది. వర్మ ట్వీట్లను పరిశీలిస్తే.. వందలో యాభై చిరంజీవి,పవన్ కళ్యాణ్ లను కార్నర్ చేస్తూనే వుంటాయి. ఈ మధ్య వర్మ దాడి ఇంకాస్త ఎక్కువైయింది. బాలకృష్ణ ‘గౌతమీ పుత్రశతకర్ణి’ని పైకి లేపుతూ చిరు ఖైదీ-150ను తక్కువగా చేసి చూపుతున్నాడు వర్మ. కొద్దిసేపటి క్రితమే.. బాలకృష్ణ ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ తెలుగు చరిత్రకు సంబంధించిన సినిమా అని, ఖైదీ-150 మాత్రం పక్క రాష్ట్రం వాళ్ల క్రియేటివిటీ అని మరో నెగిటివ్ కామెంట్ విసిరాడు.  

మొన్న జరిగిన మెగా ఈవెంట్ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ తర్వాత వర్మ మెగా 'గోల' ఇంకాస్త ఎక్కువైయింది. నాగబాబు, వర్మను అక్కు పక్షి అని తిట్టిపోసినా వర్మ మాత్రం తన తిక్కకి లెక్కే లేదని చెబుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. అసలు ఇంతకీ వర్మకి మెగా ఫ్యామిలీకి మధ్య వున్న వైరం ఏమిటి.. ? వీరికి ఎక్కడ చెడింది. చిరు,పవన్ .. ఇప్పుడు నాగబాబులను వర్మ ఇలా వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అంటే.. ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. దర్శకుడిగా వర్మ ఫుల్ ఫాం లో వున్నప్పుడు చిరంజీవి తో  ''ఆబు బాగ్దాద్ గజ దొంగ''అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. అయితే ఎక్కడో తేడా కొట్టి స్వయంగా చిరంజీవినే ఈ సినిమాని అర్ధంతరంగా ఆపేశారు. అక్కడ మొదలైయింది ఈ గొడవ. ఆ సమయంలో వర్మ ఇగో బాగా హార్ట్ అయ్యిందట. తర్వాత పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న వర్మ ''వైఫ్ అఫ్ వరప్రసాద్ స్టోరీ'' చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ స్టోరీని రిజెక్ట్ చేసి పారేశాడు. మళ్ళీ రెండోసారి మెగా కాంపౌండ్ లో పరాభవం చవిచూశాడు వర్మ. ఈ రెండు అవమానాలు వర్మ ఇగోను తీవ్రంగా హార్ట్ చేశాయి. అప్పటి నుండి మెగా బ్రదర్స్ పై పగ పట్టేశాడు వర్మ.  

ఇప్పుడు సోషల్ మీడియా చేరువైన తర్వాత ఆయనకు మరో ఆయుధం దొరికినట్లు అయింది. ట్విట్టర్ ను వేదికగా చేసుకొని మెగా కుటుంబంపై పదేపదే తన అసహనాన్ని వెళ్ళగక్కుతున్నాడు వర్మ. అయితే ఈ మధ్య అది శ్రుతి మించింది. దీంతో ఎవరో ఒకరు సమాధానం ఇవ్వాలి కాబట్టి నాగబాబు ద్వారా వర్మకు గట్టి వార్నింగ్ ఇప్పించినట్లు భోగ్గట్టా. అయితే వర్మ ఈ విషయంలో తగ్గడం లేదు. ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. అయితే ఒక్కటి చెప్పాలి. ఈ మేటర్ చిరంజీవి గానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందిస్తే ఖచ్చితంగా నోరు మూసుకుంటాడు వర్మ. చిరు, పవన్ లు  మాత్రం వర్మ వాగుడు పై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే వర్మ ఆటలు ఇలా సాగుతున్నాయి.

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here