నాగబాబు కు వర్మ కౌంటర్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు..
on Jan 8, 2017
'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాంగోపాల్ వర్మపై నాగబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. చిరు స్టిల్స్ కి సంబంధించిన కొన్ని అంశాలపై అనేక కామెంట్స్ చేశాడు వర్మ. అయితే ఈ కామెంట్స్ పై చిరు కానీ, చరణ్ కానీ రియాక్ట్ కాలేదు. కానీ నాగబాబు మాత్రం ఈ కామెంట్స్ పై స్పందించి వర్మ దుమ్ము దులిపేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు మాట్లాడుతూ...వర్మ వాడో అక్కు పక్షి.. ముంబైలో కూర్చుని ట్విట్టర్ లోవాగుతుంటాడు.. 'వాడికి సినిమాలు తీయడం చేతకావడంలేదని, ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడని అన్నారు. వాడు మర్యాదగా ఉంటే బాగుటుందని ఈ వేదిక సాక్షిగా చెబుతున్నానని ఆయన హెచ్చరించారు. తమ ఫ్యామిలీని ఏదో అనడం ద్వారా మైలేజీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మరి ఈ మాటలు విన్న వర్మ ఊరుకుంటాడా..అసలే తనకు ఏమాత్రం సంబంధించని విషయాలపై కూడా రియాక్ట్ అయ్యే వర్మ తనపైనే కామెంట్లు ఎందుకు ఊరుకుంటాడు..నాగబాబు అలా కామెంట్లు చేశాడో లేదో వెంటనే స్పందించి నాగబాబుపై సెటైర్లు విసిరాడు. 'నా ట్వీట్టర్ అకౌంట్ ని ఎవడో ఇడియట్ హ్యాక్ చేసి తెలుగులో ట్వీట్స్ పెట్టాడు....' అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటుడు నాగబాబుకు కౌంటర్ ఇస్తూ బాంబు పేల్చాడు. 'ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి సలహా ఇచ్చావో అందరికీ తెలుసు' అంటూ' నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్ అర్థం కాదు కనుక, విద్యావంతుడైన స్నేహితుడి ద్వారా నా ఇంగ్లిష్ ట్వీట్లు తర్జుమా చేయించుకుని తెలుసుకోండి' అంటూ సూచించాడు. గ్రేట్ మెగా బ్రదర్ ముందు నాగబాబు 0.01 శాతం మాత్రమేనని, అందుకే నాగబాబులా చిరంజీవి అర్థంపర్థం లేని వాగుడు వాగాలేదని ఘాటుగా చురకలంటించారు. ఇకపోతే 'నాగబాబు సార్, ఇప్పుడే 150 ట్రైలర్ చూశాను...చాలా బాగుంది...అవతార్ కంటే కొంచెం గొప్పగానే ఉంది' అంటూ ట్వీటారు.