అందుకు దాసరికి ధన్యవాదాలు...
on Jan 7, 2017
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాయ్ లాండ్ లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ అతిరథమహారథులు చాలామందే హాజరయ్యారు. ఇక చాలా ఏళ్ల తరువాత తీస్తున్న సినిమా కాబట్టి చిరంజీవి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఇక ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతలు, కోలాహలం విని చాలా కాలమైందని, ఇది ఇంకా సరిపోవడం లేదని చిరంజీవి అన్నారు. అభిమానుల ఈ కోలాహలం చూసి విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నానా? లేక విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అన్న అనుమానం వస్తోందని అన్నారు. సముద్రం హోరును అభిమానుల హోరు మించిపోయిందని అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన దాసరి నారాయణరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఖైదీ డ్రెస్ లో ఉన్న తన స్టిల్ చూసి ఈ సినిమాకు 'ఖైదీ నెంబర్ 150' పేరు పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారని, ఆయన సూచించినట్టే ఈ సినిమాకు అదే పేరు పెట్టామని, ఈ పేరు సూచించినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు.