అన్న సినిమాపై పవన్ ట్వీట్..
on Jan 7, 2017
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హంగామా అప్పుడే మొదలైంది. ఈరోజు గుంటూరు జిల్లా చినకాకానిలో గల హాయ్ ల్యాండ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తుండగా... దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పుడే ఆయన అభిమానులు భారీ ఎత్తున హాయ్ ల్యాండ్ కు చేరుకుంటుండటంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరూ హాయ్ ల్యాండ్ కు చేరుకుంటున్నారు. ఇవన్నీ ఒకత్తు అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చేది.. రానిది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికే ఆయన వదిన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ని స్వయంగా ఆహ్వానించారని.. మరి ఆవిడ కోసమైనా పవన్ వస్తారా..?రారా? అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ.. పవన్ ట్వీట్ చేశాడు. ‘చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పవన్ ట్వీట్ చేశారు. దీనిని బట్టి పవన్ ఈ కార్యక్రమానికి రానని చెప్పకనే చెప్పినట్టు ఉంది కదా..మరి సురేఖ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం..