చిరు ముందు తేలిపోయిన బ్రహ్మీ, అలీ
on Jan 11, 2017
కమెడీయన్లతో పాటు ఇంకా చెప్పాలంటే కమెడీయన్లను మించి కడుపుబ్బా నవ్వించగలరు మెగాస్టార్ చిరంజీవి. చిరు అభిమానులు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డ్యాన్సులు, కామెడీనే. అలాంటి కామెడీని చూసి సుమారు తొమ్మిదేళ్లయ్యింది. అభిమానుల కోరిక మన్నించి 150వ సినిమాగా ఖైదీ నెం.150లో నటించారు చిరంజీవి..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఖైదీ నెం.150 ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ చిరు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని..ఇంకా చెప్పాలంటే ఆయన ముందు బ్రహ్మీ, అలీ కూడా తెలిపోయారని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్ పంచ్‌లకు కడుపు చెక్కలయ్యేలా నవ్వాల్సిందేనని వారు అంటున్నారు. ఫస్టాఫ్ అంతా ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదంటున్నారు అభిమానులు.