ఓ హోటల్లో 'కెజిఎఫ్ 2' టీమ్! ఎందుకంటే?
on Aug 4, 2020
భారీ బడ్జెట్ సినిమాల షూటింగులు స్టార్ట్ చేయడానికి హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెనుకడుగు వేస్తున్న ప్రస్తుత తరుణంలో 'కెజిఎఫ్ 2' టీమ్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆగస్టు మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని 'కెజిఎఫ్ 2' నిర్మాత కార్తీక్ గౌడ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ 90 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. మరో 10 పర్సెంట్ మాత్రమే బాలన్స్ ఉంది. త్వరలో దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, మరికొన్ని సన్నివేశాలు ఉన్నాయట.
ప్రస్తుతం షూటింగ్ చేయబోయే టెక్నికల్ టీమ్ అందరికి లొకేషన్‌కి దగ్గరలోని ఓ హోటల్లో బస ఏర్పాటు చేశారు. షూటింగ్ మొదలయ్యేవరకు వాళ్లను క్వారంటైన్లో ఉంచాలని నిర్మాత డిసైడ్ అయ్యారు. టెస్టులు చేయించి షూటింగ్ స్టార్ట్ చేశారట. షెడ్యూల్ కంప్లీట్ అయ్యేవరకు ఎవరినీ బయటకు పంపించామని ఆయన స్పష్టం చేశారు.
Also Read