నా పెళ్లి ఫిక్స్ అనేది అబద్ధం!
on Apr 6, 2020
రాజకీయ నేపథ్యం ఉన్న కేరళకు చెందిన ఒక బిజినెస్‌మ్యాన్‌తో తన పెళ్లి ఖాయమైందనే ప్రచారాన్ని కీర్తి సురేశ్ ఖండించింది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో నటించిన 'మహానటి' చిత్రంతో జాతీయ ఉత్తమనటిగా అవార్డు అందుకున్న ఆమె పెళ్లిని తండ్రి సురేశ్ ఖాయం చేశారనీ, త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్తలను ఖండించిన కీర్తి, తన దృష్టి కెరీర్‌పైనే ఉందనీ, మరిన్ని సవాలు విసిరే పాత్రలను చేయాలనుకుంటున్నానని తెలిపింది. తనకు పెళ్లి ఫిక్స్ చేశారనే దాంట్లో నిజం లేదని తేల్చేసింది.
కీర్తి తెలుగులో చేస్తున్న 'మిస్ ఇండియా', 'రంగ్ దే' సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, 'గుడ్‌లక్ సఖి' సెట్స్‌పై ఉంది. తమిళంలో రజనీకాంత్ కుమార్తెగా 'అన్నాత్తే', లేడీ ఓరియెంటెడ్ మూవీ 'పెంగ్విన్' చేస్తోంది. అలాగే మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి 'మరక్కర్ అరబికడలింతే సింహం' సినిమా చేస్తోంది. మహేశ్ తదుపరి సినిమాలో నాయికగా ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది.