జగన్ భార్యగా కీర్తి సురేశ్?
on Mar 23, 2018
హీరో సంగతేమో కానీ... హీరోయిన్స్ ఏదైనా పాత్ర చేస్తే.. ఇంక వరుసపెట్టి అదే పాత్రలు క్యూ కడుతుంటాయి. అరుంధతి సినిమా తీసిన తరువాత అనుష్కకు ఆ తరువాత ఎక్కువ లేడి ఓరియంటెట్ మూవీసే వచ్చాయి. అనుష్కకే కాదు...చాలామంది హీరోయిన్స్ కు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ జరిగింది. ఇప్పుడు కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఇప్పటికే కీర్తి సురేశ్ మహానటి సావిత్రి బయోపిక్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే పూర్తయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ లో కీర్తికి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. అది వై.ఎస్.ఆర్. బయోపిక్. ఆనందో బ్రహ్మ' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ఆర్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ప్రచారం జరుగుతుండగా.. జగన్ భార్య పాత్రలో కీర్తి సురేశ్ నటించే అవకాశం వున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది రూమరో.. లేక నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర .. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వరకూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. విజయ్ చిల్లా .. దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read