నాగబాబుని తిట్టిపోసిన కత్తిమహేష్
on Jul 6, 2018
హిందూదేవతలను కించపరుస్తూ మాట్లాడిన కత్తి మహేష్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ నాగబాబు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే! అందులో కత్తి మహేష్ పేరు ఎత్తకుండానే అతడిని నీచుడు అంటూ పిలిచారు. ఇలాంటివాళ్లని ఉపేక్షించకూడదని హెచ్చరించారు. ఈ స్టేట్మెంట్తో కత్తి మహేష్ మళ్లీ మరోసారి చెలరేగిపోయాడు. ‘ఒక అన్నకు తమ్ముడిగా - ఒక తమ్ముడికి అన్నగా - ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నా గురించి మాట్లాడుతున్నారు,’ అంటూ దెప్పిపొడిచాడు. ‘పార్టీని అమ్ముకొని వేరే పార్టీలో కలవడం, జబర్ధస్త్ లాంటి పిచ్చి షోలలో జడ్జిగా పిచ్చి నవ్వులు నవ్వడం...ఇటువంటి పనులతో మీరు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు,’ అంటూ ఎత్తిపొడిచాడు. చివరగా- ‘ మీ అన్నదమ్ముల గురించి నేను మళ్లీ మాట్లాడడం మొదలుపెడితే మీరు తట్టుకోవడం కష్టం. జాగ్రత్తగా ఉండండి. మీ రాజకీయ జీవితం...మీ సినిమా జీవితం...ఎంత దగుల్బాజీ...దౌర్భాగ్యమో ...అందరికీ ఎలుగెత్తి చాటే రోజొస్తుందని గుర్తుపెట్టుకోండి,’అంటూ హెచ్చరించాడు. మరి ఈ వార్నింగ్‌కి మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే!