English | Telugu

కత్తి ఫీవర్‌తో.. అజ్ఞాతవాసి మజా మిస్..?

on Jan 8, 2018

సాధారణంగా పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటేనే తెలుగునాట అదో సందడి. పాటలు.. పవన్ స్టిల్స్‌తో కటౌట్లు, బ్యానర్లతో పల్లెలు, పట్టణాలు హోరేత్తిపోతాయి. అలాంటిది పవన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తోన్న అజ్ఞాతవాసికి సంబంధించి ఎలాంటి సందడి కనిపించడం లేదు. సినిమా సెట్స్ పైకి వెళ్లిన కొత్తలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్‌లుక్, టీజర్‌తో అవి ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తుండటంతో టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎవెయిటేడ్ మూవీగా మారింది అజ్ఞాతవాసి.

మూవీ రిలీజ్ డేట్ జనవరి 10 గంటల్లోకి వచ్చింది.. ఇలాంటి టైంలో అజ్ఞాతవాసి మ్యానియా ఏ మాత్రం కనిపించడం లేదు. సాధారణ ప్రేక్షకుల సంగతి పక్కనబెడితే.. పవన్ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ఇందుకు కారణం సోషల్ మీడియా సాక్షిగా పవర్‌స్టార్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్‌ మధ్య సాగుతున్న మాటల యుద్దమే. మూడు, నాలుగు నెలల నుంచి జరుగుతున్న ఈ కోల్డ్‌వార్.. ఆదివారం కొత్త టర్న్ తీసుకుంది.

పవన్, పూనమ్‌ కౌర్‌లకు కత్తి మహేశ్ ఆరు ప్రశ్నలు వేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. దీంతో పవన్ అభిమానుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో కొందరు.. కత్తికి కౌంటరిచ్చే పనిలో కొందరు బిజీ అవ్వడంతో అజ్ఞాతవాసిని మరచిపోయారంటూ ఫిలింనగర్‌‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పండగ టైంలో కుటుంబసభ్యులతో సరదాగా గడపాలి కానీ వివాదాలలో తలదూర్చడం ఎందుకంటూ కొందరు సోషలో మీడియాలో సూచిస్తున్నారు. 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here