ట్రైలర్ రివ్యూ: కాటమరాయుడు
on Mar 20, 2017
నిన్న మొన్నటి వరకు ఫస్ట్‌లుక్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసిన కాటమరాయుడు టీం రీసెంట్గా ప్రి-రిలీజ్ ఫంక్షన్ రోజు ట్రైలర్ రిలీజ్ చేసింది. బేసిగ్గా కాటమరాయుడిని తమిళ వీరం కి రీమేక్‌గా చెబుతున్నారు..ఆ సినిమాలోనూ హీరోకి పెళ్లంటే చిరాకు..తన వద్ద పెళ్లి అన్న మాట వినబడితే చాలు అంతేత్తున లేస్తాడు..అచ్చం కాటమరాయుడులోనూ ఇదే సీన్ రీపిట్ అయ్యినట్లు కనిపిస్తోంది. దానికి తోడు "అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్" అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కావడంతో ఆ విషయం చెప్పకనే చెప్పినట్లైంది.
ఇక పవన్ కళ్యాణ్ సీమ ఫ్యాక్షనిస్ట్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ శృతిహాసన్ అందంగా కనిపించింది. చివర్లో "కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో"..అనే డైలాగ్‌తో ట్రైలర్ ఎండ్ అయ్యింది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తుండగా, డాలీ దర్శకత్వం వహిస్తున్నారు..ఈ నెల 24న కాటమరాయుడును వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.