‘కాటమరాయుడు’ టీజర్ లేనట్టే..
on Jan 12, 2017
ఈ సంక్రాంతి పవన్ అభిమానులకు కాస్త నిరాశనే మిగిల్చింది అని చెప్పొచ్చు. సంక్రాంతికి కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్ విడుదల చేయడం లేదు. ఈ విషయాన్ని సినిమా యూనిట్టే తెలిపింది. జనవరి 14న ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్ విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలుపగా.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల జనవరి 26న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. సంక్రాంతికి కేవలం డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై..శరత్‌మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.