కాటమరాయుడు vs కాటమరాయుడు
on Mar 16, 2017
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆయన పేరు కనిపించినా..వినిపించినా వారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఇక పవన్ సినిమా రిలీజవుతుందంటే ఆ సందడి మాటల్లో చెప్పలేం. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు మూవీలో నటించాడు పవన్. ఈ నెల 24న కాటమరాయుడు ప్రేక్షకుల ముందకు రానున్నాడు. మరి తమ అభిమాన హీరో నటించిన సినిమాకి మరింత హైప్ తీసుకురావాలనుకున్న కొంతమంది ఫ్యాన్స్..కాటమరాయుడులోని "మిరా మిరా మీసం " సాంగ్‌ని స్పూర్తిగా తీసుకుని "అమ్షకం అద్బుతం" అనే ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేశారు.
పవన్ అంటే తమకు ఎంత అభిమానమో ఈ పాటలోని లిరిక్స్ ద్వారా వారు వ్యక్తపరిచారు. దీనికి పవన్ అభిమాని సత్యసాగర్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ అందించగా..హేమచంద్ర పాడారు. మిరి మిరా సాంగ్‌లోని లిరిక్స్‌కి ఏమాత్రం తగ్గకుండా అంతే వాడి..వేడిగా లిరిక్స్ రాశాడు సత్యసాగర్..దీనికి హేమచంద్ర గొంతు తోడవ్వడంతో ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ సాంగ్ మీరు కూడా వినాలనుకుంటే ఈ కింద ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేయండి.