పవన్ ఆత్మహత్యాప్రయత్నం ఎందుకు..??
on Mar 19, 2017
ప్రతి వ్యక్తి జీవితంలోనూ బలహీన క్షణాలు ఎదురవుతాయి. ఆ బలహీనతే మనిషిని ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తుంది. ఆ క్షణాల్ని దాటుకొని నిలబడాల్సిందే. పవన్ కల్యాణ్ జీవితంలోనూ నిరాశ నిస్పృహలు పలకరించాయి. ఈ జీవితం ఎందుకు అనుకొన్న క్షణాలూ ఉన్నాయి. పవన్ ఓసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడట. ఈ విషయాల్ని పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నాడు. ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు పవన్ చాలా నిరాశ పడ్డాడట. మార్చి లో పోతే... సెప్టెంబరు అనుకొంటే.. అక్కడా పవన్ పాస్ అవ్వలేదు. తన తోటి స్నేహితులంతా పాసై.. పై తరగతులకు వెళ్లిపోతుంటే.. తాను మాత్రం ఇంటర్‌లోనే ఉండిపోవడం, పదే పదే ఫెయిల్ అవ్వడంతో ఆత్మనూన్యతా భావనతో ఓసారి పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడట. చావు వరకూ వెళ్లొచ్చాడట.
సకాలంలో ఇంట్లోవాళ్లు చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు పోయేవే... అంటూ తన జీవితంలోని చేదు అనుభవాల్ని గుర్తు చేసుకొన్నాడు పవన్. ఓటమి బాధిస్తుంది. కానీ.. అక్కడే తట్టుకొని నిలబడాలి. గెలుపు కోసం ఏం చేయాలో ఆలోచించాలి. పవన్ చదువులో ఓ పూర్ స్టూడెంట్ కావొచ్చు. కానీ.. అతను సినిమాల్లో సూపర్ స్టార్. చిన్న చిన్న ఓటములకే భయపడి పిరికిదనంతో ఆత్మహత్యలకు పాల్పడేవాళ్లంతా పవన్‌ని చూసి ఓ విషయం నేర్చుకోవాలి. విధి.. రేపటి రోజున మనల్ని ఎలా చూడాలనుకొంటోందో, ఎంతటి విజయాల్ని అందివ్వాలనుకొంటోందో మనకు తెలీదు. పవన్ ఇంటర్ ఫెయిల్ అయ్యాక ఆత్మహత్య చేసుకొంటే.. పవర్ స్టార్‌ని మనం చూసుండేవాళ్లమా..??