ఎప్పటికీ చిరంజీవి గారే హీరో
on Mar 18, 2017
ఎప్పటికీ నా హీరో చిరంజీవి గారేనని..తాను కాదు అన్నారు పవర్ స్టార్ పవన్కళ్యాణ్. ఆయన హీరోగా నటించిన కాటమరాయుడు మూవీ ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఇవాళ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రంలో హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ మధ్యన ఇలాంటి సభల్లో మాట్లాడటం అలవాటు తప్పిందని, అందుకే కొత్తగానూ, కాస్త బెరుగ్గానూ ఉందన్నారు పవన్. తాను అభిమానులపై ప్రేమతోనే చిన్న ఆడిటోరియంలో వేడుక నిర్వహించాలనని నిర్మాతలను కోరానని..ఎంత ఫంక్షన్ చేసినా సరిపోదని..అందుకే పరిమితుల్లో ఫ్రి రిలీజ్ వేడుక జరగాలని చిన్నగా ఫంక్షన్ చేయాలని కోరానని అన్నారు. తాను జీవితంలో నేర్చుకున్న చాలా అంశాలు సినిమాల్లోకి వచ్చాయని పవన్ చెప్పారు. ఈ ప్రపంచంలో అందరూ సమానమే అన్న విషయం గుర్తించుకో అన్న విషయం ప్రతి క్షణం గుర్తుంచుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.