పవన్‌తో మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తోంది
on Mar 18, 2017
పవన్ కళ్యాణ్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉందన్నారు కాటమరాయుడు సినిమా దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ). పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ..గోపాల గోపాల సినిమా తీసినప్పుడు పవన్‌తో ఇన్ని రోజులే పని చేశానా...? మరికొన్ని రోజులు పని చేస్తే బాగుంటుందని అనిపించిందని ఆయన చెప్పారు. అయితే అప్పుడు మరో సినిమా నాతో చేస్తానని చెప్పార...ఇచ్చిన మాట ప్రకారం వెంటనే చేశారని అందుకు ఆయనకు ధన్యవాదాలని చెప్పారు. పవన్‌తో దాహం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదని డాలీ చెప్పారు.