ENGLISH | TELUGU  

ఆ ఎన్‌కౌంటర్ మంచిదే.. కానీ సమస్యకు అది సొల్యూషన్ కాదు!

on Dec 10, 2019

 

'దిశ' ఉదంతంలో నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యడం సరైనదేననీ, అయితే సమస్యకు అది పరిష్కారం కాదనీ అంటున్నాడు యంగ్ హీరో కార్తికేయ. '90ఎంఎల్' మూవీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను దిశ ఉదంతంపై తన అభిప్రాయాలను 'తెలుగుఒన్'తో పంచుకున్నాడు. "ఎన్‌కౌంటర్ జరగడం మంచిదే. సొసైటీకి అలాంటివాళ్లు చాలా డేంజర్. ఏ రోజుకైనా వాళ్లకు ఆ శిక్షే కరెక్ట్. ఇంకా దారుణంగా చేసినా తప్పులేదు. అయితే ఇలాంటి హత్యాచార ఘటనలు ఆగాలంటే ఇది సొల్యూషన్ కాదనేది నా అభిప్రాయం. చంపడం సమస్యకు పరిక్షారం కాదు. అలాంటి ఘటనలు ఎక్కడా జరక్కుండా చెయ్యడమే పరిష్కారం. అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వాలంటే వీళ్లను చంపితే అవ్వదు. ఎన్‌కౌంటర్ జరిగిందని సెలబ్రేట్ చేసుకోకూడదు" అని చెప్పాడు కార్తికేయ.

స్త్రీల విషయంలో మగవాళ్లకు చెడు ఆలోచనలు కలగని సమాజం రావాలని అతను ఆకాక్షించాడు. "స్కూల్లోనే దాన్నొక సబ్జెక్టుగా పెట్టాలి. అమ్మాయిల్ని గౌరవంగా చూడాలనే విషయాన్ని అబ్బాయిలకు స్కూలు రోజుల నుంచే నేర్పాలి. అలాగే అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలి. ప్రాథమిక విద్య నిర్బంధంగా అందరికీ అందేలా చూడాలి. క్షేత్ర స్థాయిలో ఒక తరం నుంచే మార్పు వస్తే సొసైటీలో మార్పు వస్తుంది. దీన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని, అలాంటి ఘటనలు ఎక్కడా జరక్కుండా చూసుకోవాలి" అని అతను సూచించాడు.

దిశ ఉదంతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన వాళ్లే నేరగాళ్లని అతను నమ్ముతున్నాడు. "వాళ్లు కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఆమాత్రం చూసుకోకుండా పోలీసులు ఎన్‌కౌంటర్ చెయ్యరు. ఈ ఎన్‌కౌంటర్ వల్ల దిశ వాళ్ల ఫ్యామిలీకి కనీసం బతుకు మీద ఒక హోప్ ఉంటుంది. నిందితులెక్కడో హ్యాపీగా ఉన్నారని తెలిస్తే వాళ్లకు జీవితం మీదే ఆశ పోతుంది. ఎలాంటి నేరం చేసైనా సర్వైవ్ అవ్వచ్చంటే, చాలామందికి జీవితం మీద ఆశ పోతుంది. ఇలాంటిది జరిగితే కనీసం బాధిత కుటుంబాలు కుదుటపడతాయి" అని చెప్పాడు కార్తికేయ. 

చదువులేని వాళ్లలోనే కాకుండా  చదువుకున్న వాళ్లలోనూ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని అతను బాధను వ్యక్తం చేశాడు. "ఆఫీసులో ఎవరైనా కొత్తమ్మాయో లేదా జూనియరో వచ్చిందంటే, ఆమెకు ఇష్టం లేకపోయినా వెళ్లి మాట్లాడటం, ఏదో గెలకడానికి ట్రై చెయ్యడం.. అలాంటి యాటిట్యూడ్ మన సొసైటీలో ఉంది. అదే మారాలి. దిశ ఆ టైంలో ఎవర్నీ తోడు తీసుకెళ్లలేదు. వెళ్లి టోల్‌గేట్ దగ్గర నిల్చోలేదు. ఎందుకంటే అక్కడ తనను చూస్తుంటారనే ఉద్దేశంతో. అంటే ఆమెకు మనమే అలాంటి స్థితిని క్రియేట్ చేశాం. ఎవర్నీ నమ్మేటట్లు లేని స్థితిని అమ్మాయిలకు మనకు తీసుకొచ్చాం. అది మారాలి" అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.