'90ఎంఎల్ కార్తికేయ' అని పిలుస్తారా?
on Nov 5, 2019
'ఆర్ఎక్స్ 100 కార్తికేయ' అనే గుర్తింపు నుంచి 'గుణ 369 కార్తికేయ' గుర్తింపు కోసం ఆరాటపడిన యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ఆశలు ఫలించలేదు. ఇప్పుడు అతను '90ఎంఎల్' అనే సినిమా చేస్తున్నాడు. అతని సొంత బేనర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో శేఖర్ రెడ్డి ఎర్ర డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నేహా సోలంకి నాయికగా నటిస్తోంది.
టైటిల్‌కి తగ్గట్లుగా ఈ మూవీ వైవిధ్యంగా ఉంటుందనీ, కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక విశేషం.. మూడు పాటల్ని అజర్ బైజాన్‌లో చిత్రీకరించడం. "అజర్ బైజాన్ రాజధాని బాకులో బ్యూటీఫుల్ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర 8 రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో హీరోయిన్లపై 'వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే' అనే ఎమోషనల్ గీతాన్ని చిత్రీకరించాం. 'సింగిల్ సింగిల్' అనే పాటను ఫుల్ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. 'నాతో నువ్వుంటే చాలు' అనే డ్యూయట్‌ని హీరో - హీరోయిన్, 10 మంది డ్యాన్సర్లపై షూట్ చేశాం. ఈ 3 పాటలకూ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఎక్స్ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. సినిమాకి ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి" అని డైరెక్టర్ శేఖర్‌రెడ్డి తెలిపారు.
రవికిషన్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో రావు రమేశ్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రధారులు. అనూప్ రూబెన్స్ స్వారాలు కూర్చగా, చంద్రబోస్ పాటలు రాశారు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ', 'లై', 'సవ్యసాచి' సినిమాలకు పనిచేసిన జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాతో కార్తికేయను '90ఎంఎల్ కార్తికేయ' అని పిలుస్తారేమో చూద్దాం.
Also Read