కొడుకుతో సరదాగా కరీనా కపూర్!
on Mar 18, 2017
కరీనా కపూర్ కొడుకు పుట్టిన మొదటి రోజు నుండి తరచుగా ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నాడు. బుడ్డోడిది ఏదో చేసి సంచలనం సృష్టించే వయసు కాకపోయినా, తన చుట్టూ జరిగే ప్రతి విషయం చర్చనీయాంశం అయింది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తర్వాత అబ్బాయికి తైమూర్ అని పేరు పెడితే, విమర్శలు ఎదురయ్యాయి. రెండు రోజుల క్రితం బెబో మరియు తైమూర్ బయటకు వెళ్ళినపుడు మీడియా కంట పడ్డారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు కరీనా - తైమూర్ ల కొత్త ఫోటో అందర్నీ అలరిస్తుంది. ఈ ఫొటోలో, కరీనా చిన్నారి తైమూర్ ని ముద్దు పెడుతూ కనిపిస్తుంది. క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న తైమూర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కరీనాని చూస్తూ కళ్లప్పగించకుండా ఎలాగయితే చూస్తామో, తైమూర్ ని చూస్తూ కూడా రెప్ప వేయలేం. అంత అందం ఈ బుడ్డోడి సొంతం. కొందరు మాత్రం, ఈ ఫొటోలో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా ఉండుంటే, ఫామిలీ ఫోటో అయ్యుండేది అని అభిప్రాయం పడుతున్నారు.