బిగ్ బాస్ 4: అనుకున్నట్లే కరాటే కల్యాణి ఔట్!
on Sep 20, 2020
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు. దాంతో ఎలిమినేషన్ జాబితాలో ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. రెండోవారం సభ్యుల ప్రవర్తన పట్ల కోపంగా ఉన్న బిగ్ బాస్ వారికి గుంజీలు తీసే శిక్ష కూడా వేశాడు. బిగ్ బాస్ కోపం నాగార్జునలోనూ కనిపించింది. హౌస్ లో అందరూ సేఫ్ గా ఆడుతున్నారని నిబంధనలను పాటించడం లేదని నాగార్జున సభ్యులపై కోప్పడ్డారు. ఎలిమినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోలేదన్నారు.
బిగ్ హౌస్ సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న గంగవ్వ సేఫ్ అయ్యారని నాగార్జున చెప్పారు. మిగతా ఎనిమిది మందిలో ఈ రోజు ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ కరాటే కల్యాణి అని ప్రకటించారు. దాంతో ప్రేక్షకుల అంచనా నిజమై కల్యాణి బ్యాగ్ సర్దేసింది. ఇంటి సభ్యులంతా ఆమెకు వీడ్కోలు పలికారు. "మంచిగా ఆడండి" అంటూ అందరికీ కన్నీటిలో వీడ్కోలు చెప్పింది కల్యాణి. మోనాల్ ఆమెను వాటేసుకుని గట్టిగా ఏడ్చేసింది. హౌస్ నుంచి బయటకు వెళ్ళే మరో కంటెస్టెంట్ కుమార్ సాయి అన్న ప్రేక్షకుల ఊహా నెక్ట్స్ ఎపిసోడ్ లో నిజమయ్యే అవకాశాలున్నాయి.