English | Telugu

టాలీవుడ్ ‘క్వీన్’

on Sep 6, 2017

‘క్వీన్’.. ఈ పేరు వింటే అభిరుచిగల ప్రేక్షకులకు ఒళ్లు పులకరించక మానదు. ఎందుకంటే.. ఆ సినిమా అలాంటిది. అందులో కంగనా రనౌత్ అభినయం అలాంటిది. ఆ సినిమాను సౌత్ తో రీమేక్ చేయాడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకొని...  స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మన సౌత్ హీరోయిన్లు కూడా ‘క్వీన్’లా కనిపించడానికి ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో.. ఎవరిని  ఈ గోల్డెన్ ఆఫర్ వరిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిన అంశం. 

ఇదిలావుంటే... త్యాగరాజన్ ఇటీవల తమన్నాను కలిసి ఈ విషయంపై మాట్లాడాడు. అయితే... రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చి.. తమన్నా తప్పుకుంది. అయితే... రీసెంట్ గా ఆ సినిమా తెలుగు రైట్స్ ని వేరే నిర్మాత దక్కించుకున్నాడు. నీలకంఠ దర్శకత్వంలో తాను ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ విషయంపై దర్శక, నిర్మాతలు తమన్నాను కలిశారు. అంతేకాదు... తమన్నా అడిగిన పారితోషికం ఇవ్వడానికి కూడా వారు అంగీకరించారు. అంటే.. టాలీవుడ్ ‘క్వీన్’గా తమన్నా త్వరలోనే కనిపించనుందన్నమట. 

కంగనా స్థాయిలో ఆ పాత్రను రక్తికట్టించడం అంటే సాధారణమైన విషయం కాదు. మరి తమన్నా ఏ మాత్రం చేస్తుందో చూడాలి. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here