కంగన రూటే సపరేటు.. ఒకవైపు కాంట్రవర్సీస్.. ఇంకోవైపు డాన్స్ రిహార్సల్స్!
on Sep 29, 2020
కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగకుండా విజృంభిస్తున్నప్పటికీ, ఇంత కాలం పని ఆపి కూర్చున్న సినీ, టెలివిజన్ రంగాలు.. కొన్ని వారాలుగా నెమ్మదిగా పనులను పునఃప్రారంభిస్తూ వస్తున్నాయి. అదే విధంగా తలైవి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె షేర్ చేసిన పోస్ట్ దీన్ని తెలియజేస్తోంది. "ఫైనల్లీ బ్యాక్ టు వర్క్" అనే కాప్షన్‌తో తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌తో డాన్స్ రిహార్సల్ చేస్తూ తీసుకున్న సెల్ఫీని ఆమె షేర్ చేశారు.
కంగన ప్రస్తుతం తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఉంటున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తయారవుతున్న తలైవిలో ఓ పాట కోసం ఆమె అక్కడే డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రసన్నబాబు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రనౌత్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. అందులో ఫ్రెండ్స్ టీ-షర్ట్ వేసుకున్న కంగన.. సెల్ఫీ కోసం నవ్వుతూ నిల్చున్నారు.
"ఫైనల్లీ బ్యాక్ టు వర్క్. జయలలిత మేడమ్ బయోపిక్ 'తలైవి' కోసం డాన్స్ రిహార్సల్ స్టార్ట్ చేశాం. బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్, మోస్ట్ హంబుల్ పర్సన్, ఇన్స్పైరింగ్ స్టార్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ మేడమ్‌తో అద్భుతమైన రిహార్సల్ టైమ్ గడిపాను. సాంగ్ షూట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ పాటకు నా మాస్టర్, ఎవర్గ్రీన్ బృంద మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు" అని రాసుకొచ్చాడు ప్రసన్న. ఆ ఫొటోనే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు కంగన.
Also Read