అమీర్ ను చీప్ గా చూసిన బ్యూటీ
on Apr 19, 2014
బాలీవుడ్ టాప్ హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు. అమీర్ సరసన నటించాలని ప్రతీ ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. ఎందరికో దక్కని ఈ అదృష్టం హీరోయిన్ కంగనా రనౌత్ కి దక్కింది. కానీ ఈ అమ్మడు చేతికి వచ్చిన అదృష్టాన్ని పక్కన పెట్టి పోజు కొడుతుంది. అమీర్ నటించబోయే తాజా చిత్రంలో కంగనాను హీరోయిన్ గా తీసుకోవాలని అమీర్ భావిస్తున్నాడట. ఈ విషయం తెలిసిన కంగనా మాత్రం "అమీర్ తో నటించడం నాకు పెద్ద ఘనత కాదు. నాకు అదేం లక్ష్యం కాదు" అని అందట. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు "ఈ అమ్మడికి బాగా ఎక్కువయ్యిందని" అంటూ గుసగుసలు పెడుతున్నారు. మరి ఈ అమ్మడు అమీర్ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.