'బల్లీవుడ్' లైంగిక వేటగాళ్లతో నిండిపోయి ఉంది.. కంగన కామెంట్!
on Sep 20, 2020
పాయల్ ఘోష్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఇటీవల ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్ల హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై తాజాగా మరో వివాదం మొదలైనట్లు అయ్యింది. కశ్యప్ తనకు అసౌకర్యాన్ని కలిగించాడని పాయల్ ఆరోపించింది. ఆమె ఆరోపణలపై అందరి ఫోకస్ మళ్లింది. ఇది పరిశ్రమలో సంఘర్షణకు నాంది పలికి, ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో పాయల్ కు మద్దతుగా కంగనా రనౌత్ ముందుకు వచ్చింది. బాధితురాలు చేసిన ఆరోపణలకు అనురాగ్ అర్హుడని ఆమె చెప్పింది.
ఈ అంశంపై వరుసగా ట్వీట్స్ చేసిన కంగన, బాలీవుడ్‌ను బల్లీవుడ్ అని సంబోధిస్తూ, అది పూర్తిగా లైంగిక వేటగాళ్లతో నిండిపోయిందని పేర్కొంది. "నాకు తెలిసినంతవరకు అనురాగ్ వివిధ వ్తక్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్లతో ఏకీభావం చెందలేదు. పాయల్ విషయంలో అనురాగ్ చేసింది బల్లీవుడ్లో ఒక కామన్ ప్రాక్టీస్. ఇక్కడకు వచ్చి స్ట్రగుల్ అవుతున్న బయటి అమ్మాయిలను సెక్స్ వర్కర్ల లాగా చూడటం వాళ్లకు సహజంగానే వస్తుంది. పాయల్ చెప్పిన దానిని చెయ్యడంలో అనురాగ్ చాలా సమర్థుడు. అతను తన పార్టనర్స్ అందరినీ మోసం చేశాడు. ఎవరితోనూ అతను ఏకీభావం చెందలేదు. ఫాంటమ్ (ప్రొడక్షన్ హౌస్) చాలా మంది "మీ టూ" నిందితులతో, స్త్రీలోలులతో నిండి ఉంది. ఇదివరకు కూడా నేను వాళ్ల బాధితులకు మద్దతునిచ్చాను. దాంతో ఉదారవాదులు నాపై దుష్ప్రచారం ప్రారంభించారు" అని రాసుకొచ్చింది.
Also Read