కమల్-గౌతమిల మధ్యలో రమ్యకృష్ణ..?
on Nov 9, 2016
యూనివర్శిల్ స్టార్ కమల్‌హాసన్‌తో తన 13 ఏళ్ల సహజీవన బంధాన్ని తెంచుకున్నారు గౌతమి. ఇందుకు ఫలానా కారణం అని తెలియకపోయినా ప్రస్తుతం అందరి వేళ్లు చూపెడుతోంది మాత్రం శృతీహాసన్ వైపే. కమల్-గౌతమి కలిసి ఉండటం శృతికి అస్సలు ఇష్టంలేదని ఈ విషయంలో చాలాసార్లు గొడవలు అయ్యాయాని..శభాష్ నాయుడు షూటింగ్లో ఈ విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా గౌతమి..ఒక కీలకపాత్రలో శృతీహాసన్ నటిస్తున్నారు. అయితే గౌతమి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ శృతికి నచ్చలేదట..చివరికి ఇద్దరూ మాటా..మాటా కూడా అనుకున్నారట..ఈ విషయంలో కమల్ కూతురివైపే మాట్లాడటంతో గౌతమి బాగా హర్ట్ అయ్యిందట.
ఈ సంగతి పక్కనబెడితే ఈ బ్రేకప్‌కు కారణంగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా నటిస్తోన్న రమ్యకృష్ణకు కూడా ఇదే కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమితో గొడవ జరిగిందట. గౌతమి డిజైన్ చేసిన దుస్తులను వేసుకోవడానికి రమ్య ససేమిరా అందట. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కమల్ మధ్యలో జోక్యం చేసుకుని ఇద్దరికీ రాజీ కుదిర్చారట..అయితే తనను కాకుండా రమ్యకే సపోర్ట్ చేయడం గౌతమిని తీవ్రంగా బాధించిందట. అప్పుడు కూతురికి..ఇప్పుడు మరో హీరోయిన్ మాటకే విలువనిచ్చిన కమల్ తనను కాదనేసరికి గౌతమి తట్టుకోలేక విడిపోయేందుకు నిర్ణయించుకుందని కోలీవుడ్ టాక్.