వీరాభిమానికి వీడియో కాల్ చేసిన కమల్
on Apr 8, 2020
నోవల్ కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రజలను ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండమంటూ అనేక దేశాల ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీనితో సెలబ్రిటీలకు తీరిక దొరికి, ఇదివరకెన్నడూ చేయని అనేకానేక పనులు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నారు. నటుడు-రాజకీయవేత్త కమల్ హాసన్ సైతం దీనికి మినహాయింపు కాదు. తన వీరాభిమానుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు.
30 ఏళ్ల పోగన్ నడుము కింద భాగమంతా చచ్చుపడిపోయింది. తన ఆరాధ్య నటుడు కమల్ని కలిసి మాట్లాడాలనేది అతని చిరకాలపు కల. ఈ విషయం తన పార్టీలోని ఒక సభ్యుడి ద్వారా కమల్‌కు తెలిసింది. వెంటనే పోగన్ కోరికను తీర్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. పోగన్కు వీడియో కాల్ చేసిన కమల్, అతనితో గంటకు పైగా మాట్లాడారు. మొదట అమితాశ్చర్యానికి గురైన పోగల్, తన చివరి శ్వాస దాకా ఈ క్షణాల్ని మర్చిపోలేనని కమల్‌తో చెప్పాడు. అతనితో కమల్ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న పిక్చర్లు సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ సభ్యుడు, వ్యాపారవేత్త సీకే కుమరవేల్ తన ట్విట్టర్ అకౌంట్లో మొట్టమొదటగా ఈ పిక్చర్లను పోస్ట్ చేసి వాటికి ప్రాచుర్యం కల్పించారు.
Also Read