English | Telugu

`ప్రెగ్నెన్సీ విమెన్ ` గా న‌టించాః అక్ష‌ర్ హాసన్

on Jul 17, 2019

చియాన్ విక్ర‌మ్ హీరోగా అక్ష‌ర హాస‌న్, అభిహాస‌న్ ముఖ్య పాత్ర‌ల్లో రాజేష్ ఎం. సెల్వ డైర‌క్ష‌న్ లో త‌మిళంలో రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మాణంలో రూపొందిన క‌డ‌ర‌మ్ కొండాన్ చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ కెకె `పేరుతో తెలుగులో ఈ నెల 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌హాస‌న్ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఆమె మాట‌ల్లో...

వండ్ర‌ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్?

విక్ర‌మ్ గారితో న‌టించడం అమేజింగ్ ఎక్స్ పీరియ‌న్స్ . నేను న‌టించాల‌నుకునే హీరోల్లో ముందు వ‌రుస‌లో ఉండే హీరో విక్ర‌మ్ గారు. అత‌ని ప‌ర్ఫార్మెన్స్ ని  ఏ యాక్ట‌ర్ తో పోల్చి చూడ‌లేం. వ‌న్ ఆఫ్ ది వెర్సాటైల్ యాక్ట‌ర్ ఆయ‌న‌. యాక్టింగ్ విష‌యంలో నాకు చాలా హెల్ప్ చేసారు.

నా క్యార‌క్ట‌ర్ పేరు అతిర?

ఇందులో నా క్యార‌క్ట‌ర్ పేరు అతిర‌. అభి హాస‌న్ కి వైఫ్ గా ప్రెగ్నెంట్ విమెన్ గా న‌టించాను. ఇంత‌కు మించి నా పాత్ర‌కు గురించి చెబితే ఎగ్జైటింగ్ పోతుంది కాబ‌ట్టి థియేట‌ర్ లో చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది.

రెమ్యూనిరేష్ తీసుకున్నారా?

మా బేన‌ర్ లో సినిమా చేసినా కానీ రెమ్యూనిరేష‌న్ తీసుకున్నా, వ‌ర్క్ ఈజ్ వ‌ర్క్.  (లాఫింగ్) ఇక మా బేన‌ర్ లో వ‌ర్క్ చేయ‌డం అమేజింగ్ ఎక్స్ పీరియ‌న్స్. ఎందుకంటే ఈ బేన‌ర్ లో ఎన్నో లెజండ‌రీ మూవీస్ వ‌చ్చాయి.

అమ్మా స‌ల‌హాలు తీసుకున్నా?

అవును క‌థ ప‌రంగా ప్రెగ్నెన్సీ ఉమెన్ పాత్ర కాబ‌ట్టి అమ్మ‌గారి నుండి కొన్ని స‌ల‌హాలు , సూచ‌న‌లు తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్ నుంచి కొన్ని స‌ల‌హాలు తీసుకున్నా. క్యార‌క్ట‌ర్ ని అర్థం చేసుకుని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని న‌టించా.

అమితా బ‌చ్చ‌న్ గారు ఎంకరేజ్ చేసారు?

అమితాబ్ స‌ర్ తో యాక్ట్ చేయ‌డం కొన్ని సార్లు క‌ష్టం, చాలా ఎంకరేజ్ చేసారు. అలాగే ధ‌నుష్ , పీసీ స‌ర్ కూడా న‌న్ను చాలా ఎంక‌రేజ్ చేసారు. అయితే పెద్ద స్టార్స్ తో క‌ల‌సి నలించేట‌ప్పుడు కొంత నెర్వ‌స్ అయ్యేదాన్ని.

క్లారిటీ ఉన్న డైర‌క్ట‌ర్?

రాజేష్ త‌న వ‌ర్క్ ప‌ట్ల ఎంతో క్లియ‌ర్ గా ఉండేవారు. నాకు ఏ సీన్ అయినా అర్థం కాక‌పోతే ఎంతో పేసెన్సీతో ఎక్స్ ప్లైన్ చేసి చెప్పేవారు. అలాగే టెక్నిక‌ల్ గా కూడా చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటారు. అంద‌రితో కంఫ‌ర్ట్ గా ఉంటూనే త‌న‌కు ఏం కావాలో అది రాబ‌ట్టుకుంటారు.

 డైర‌క్ష‌న్ చేయాల‌నుకోవ‌డం లేదు?

నా ద‌గ్గ‌ర రెండు మూడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటిని ఫినీష్ చేస్తాను. ఇంకా కొన్నిఐడియాస్ కూడా ఉన్నాయి.  కానీ వాటికి మా నాన్న‌గారి ప‌ర్మిష‌న్ కావాలి. ఆయ‌న ప‌ర్మిష‌న్ వ‌చ్చాక మిగ‌తా విష‌యాలు మీడియాకు చెబుతాను. డైర‌క్ష‌న్  చేసే ఆలోచ‌న మాత్రం లేదు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here