అన్నయ్య కి నో చెప్పి, మహేష్ కి యస్ చెప్పిన ఎన్టీఆర్
on Apr 3, 2018
అన్నయ్య కళ్యాణ్ రామ్ తో అత్యంత సన్నిహితంగా మెదులుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి డుమ్మా కొట్టాడు. ఈ విషయమై ప్రస్తావన వచ్చినప్పుడు కళ్యాణ్ రామే తమ్ముడిని వెనకేసుకు వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కసరత్తులు చేస్తున్నాడని, తన లుక్ రెవీల్ చేయకుండా ఉండటానికి బయటకి రావడం లేదని అన్నాడు. ఎన్టీఆర్ వస్తానని చెప్పిన, తానే వద్దన్నానని కూడా అన్నాడు. అయితే, ఆ విధంగా అన్నయ్య ఫంక్షన్ కి డుమ్మా కొట్టిన ఎన్టీఆర్, మహేష్ బాబు భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాత్రం వెళ్ళడానికి తన అంగీకారం తెలిపాడట. మహేష్ బాబు స్వతహాగా ఫోన్ చేసి, ఎన్టీఆర్ ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడట. ఎన్టీఆర్ కూడా ఫ్రీ గా ఉండడంతో యస్ చెప్పాడట. అయితే, మహేష్ చేత ఫోన్ చేయించింది మాత్రం డైరెక్టర్ కొరటాల శివ అని అంటున్నారు. ఎన్టీఆర్ వస్తే, సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతాయి అనేది కొరటాల అభిప్రాయం. ఏదిఏమయినా అన్నయ్య ఫంక్షన్ కి నో చెప్పి, మహేష్ ఈవెంట్ కి మాత్రం ఎన్టీఆర్ యస్ చెప్పడం చర్చనీయాంశం అయింది. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 7 న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఈ ఫంక్షన్ జరగనుంది.