అనురాగ్‌కు మరో మాజీ భార్య కల్కి ఫుల్ సపోర్ట్!
on Sep 21, 2020
నటి పాయల్ ఘోష్ నుంచి సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు ఎదుర్కొన్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు ఆయన మాజీ భార్య, నటి కల్కి కోచ్లిన్ నుంచి మద్దతు లభించింది. ఇంతకుముందు ఆయన తొలి భార్య ఆర్తీ బజాజ్ కూడా అనురాగ్‌కు సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన సుదీర్ఘ ఉత్తరంలో కల్కి తన మాజీ భర్తకు ఫుల్ సపోర్ట్ చేసింది.
"నీ స్క్రిప్టుల్లో స్త్రీల స్వేచ్ఛ కోసం ఫైట్ చేశావు, నీ ప్రొఫెషనల్ స్పేస్‌లోనే కాకుండా నీ పర్సనల్ లైఫ్‌లోనూ వాళ్ల సమగ్రతను సమర్థించావు. దానికి నేను సాక్షిని." అని అనురాగ్‌ను ఉద్దేశించి రాసిన ఆ లెటర్లో తెలిపింది కల్కి. 2015లో తాము విడిపోయిన తర్వాత కూడా తన ఇంటిగ్రిటీ కోసం నిలబడ్డాడనీ, పనిలో సురక్షితంగా లేనని తాను భావించినప్పుడల్లా అతను సపోర్ట్‌గా నిలిచాడనీ ఆమె చెప్పింది. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే ఆలోచన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఒకరినొకరు వేధించుకుంటున్న వింత కాలంలో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అనురాగ్‌కు ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా, "ఈ వర్చువల్ రక్తపాతానికి మించి గౌరవం ఉన్న, ఎవరూ చూడని దయామయ చోటు ఉంది. ఆ ప్లేస్ నీకు బాగా పరిచయమైందేనని నాకు తెలుసు... నీ డిగ్నిటీ మీద నిలబడి బలంగా ఉండు" అని తన ప్రేమనూ, మద్దతనూ తెలిపింది కల్కి కోచ్లిన్.
Also Read